లగడపాటి అరెస్ట్ కు రంగం సిద్ధం

Lagadapatiవిజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. “వస్తున్న.. మీకోసం” పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణాజిల్లాలో ప్రవేశించనున్నారు. అయితే సమైక్యవాదానికి మద్దతు తెలపాలంటూ.. లగడపాటి కనువిప్పు యాత్రకు సిద్ధం కావడంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయినట్టు తెలుసోంది. దీంతో అనుమంచిపల్లిలోని లగడపాటి నివాసం దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రావడంతో లగడపాటి ఇంటికి తాళం వేసుకుని లోపలే డిపోయారు. మరోవైపు పోలీసులు ఆయన్ని బయటకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసందర్భంగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.