నంద్యాల ఉపఎన్నికలు : లగడపాటి సర్వే ఫలితాలు

ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా లగడపాటి రాజగోపాల్‌ ప్రత్యేకంగా సర్వే చేయించడం మనం చూశాం. గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు లగడపాటి రాజగోపాల్‌ సర్వేలు 90 శాతం నిజం అయ్యేది. కాని రాజకీయాల నుండి తప్పుకున్న తర్వాత కాస్త సందడి తగ్గింది. మళ్లీ ఇన్ని రోజులకు లగడపాటి రాజగోపాల్‌ నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ఫలితాలను కూడా సన్నిహితుల వద్ద లగడపాటి చెప్పుకొచ్చాడు.

తన సర్వేలో నంద్యాల ఉప ఎన్నికల్లో వైకాపా గెలుపుకు ఎక్కువ ఛాన్స్‌ ఉందని, తెలుగు దేశం పార్టీకి ప్రజల మద్దతు తక్కువగా ఉందని, సింపతి కూడా పని చేయకపోవచ్చు అంటూ రాజగోపాల్‌ అభిప్రాయ పడుతున్నారు. వైకాపా గట్టిగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీకి కష్టాలు తప్పడం లేదని ఆయన అంటున్నాడు. అయితే వైకాపా కొన్ని స్వయంకృత అపరాధాలు చేస్తుంది.

తెలుగు దేశం పార్టీకి బలం చేకూరేలా వైకాపా వారు మాట్లాడుతున్నారు. అందుకే తెలుగు దేశం పార్టీకి కూడా ఛాన్స్‌ పూర్తిగా లేదని చెప్పలేం. కనుక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా ఏంటి అనేది చెప్పలేం.