ఏపీ నుండి కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో లేకపోవడం, సభలో ఉన్న ఇతర కాంగ్రెస్ ఎంపీలు ఎవరు కూడా కేవీపీకి మద్దతుగా నిలవకపోవడంతో పాటు, ఆయన్ను వెనక్కు వచ్చేయాల్సిందిగా పిలుస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కూడా కేవీపీ తీరుపై తప్పుబడుతూ, సభ నుండి బయటకు పంపుతాం అంటూ చెప్పడంతో కేవీపీ స్వయంగా పార్లమెంటు భవనం వెలుపలకు వచ్చి, అక్కడ గాంధీ విగ్రహం ముందు నిల్చుని నిరసన తెలియజేశాడు. ఏపీకి న్యాయం చేయాల్సిందిగా ప్లకార్డుతో గాంధీ బొమ్మకు ఎదురుగా నిల్చున్న ఫొటో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతుంది. కేవీపీ చేస్తున్న ఒంటరి పోరాటంకు ఏపీ ప్రజలు ముగ్దులవుతున్నారు.