ఎలక్షన్స్ ఎఫెక్ట్ : దోషలేసిన నటి ఖుష్బు

నటి ఖుష్బు సుందర్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నుంగంబాక్కంలోని వెస్ట్ మాడా వీధిలోని థౌసండ్ లైట్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు, ఆమె ఒక రెస్టారెంట్ వద్ద ఆగి, అక్కడ దోశలు వేసి తన వంట నైపుణ్యాలను ప్రదర్శించింది. మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో, తమిళనాడులో చాలా మంది అభ్యర్థులు తమ ప్రచార సమయంలో లేదా నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు సృజనాత్మక తో కూడిన ఆలోచనలతో ముందుకు వస్తున్నారు.

మొదట 2010 లో డిఎంకె పార్టీలో చేరిన నటి ఖుష్బు అక్కడ తనకు తగిన గుర్తింపు దొరకకపోవడంతో 2014 ఆ పార్టీ ని వీడి కాంగ్రెస్ చేరారు, కొంతకాలం కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్పోక్స్ పర్సన్ గా సేవలందించారు, 2020 లో కాంగ్రెస్ పార్టీ కి టాటా చెప్పేసి బీజేపీ లో చేరారు. ప్రస్తుత తమిళనాడు ఎలక్షన్స్ లో భాగంగా థౌసండ్ లైట్స్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున నామినేషన్ వేశారు.