కర్నూలు జిల్లా కలెక్టర్ P.కోటేశ్వరరావు తన 4 ఏళ్ల కొడుకు దివి అర్విన్ ను శుక్రవారం నాడు తన బంగళాకు సమీపంలో ఉండే బుధవారపేటలోని అంగన్ వాడి ప్రీ స్కూల్ లో చేర్పించారు. సామాన్యుడి తరహాలో కొడుకును అంగన్ వాడి కేంద్రంలో చేర్పించిన P.కోటేశ్వరరావు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇది చూసిన నెటిజన్లు శబాష్… కలెక్టర్, రాజకీయ నాయకులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.