కేకే ను ఢీకొన్న కేటీఆర్.. ?

ktr kkతెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ కె.కేశవరావుకు సమయం చూసి సమాధానం చెప్పారు తెరాస అధినేత కేసీఆర్ తనయుడు, ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణ సాదించిన క్రెడిట్ ఏ ఒక్క కధానాయకుడిది కాదని, ఆ ఘనత కేవలం అమరవీరులకే చెందుతుందని ఇటీవల కేకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ పార్టీగా.. గత 12సంవత్సరాలుగా తెలంగాణ కోసం పాటుపడుతున్న తెరాసకు కేకే వ్యాఖ్యలు కాస్త కఠనంగా అనిపించాయి. అయినా.. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగిన కేకే పై విమర్శించే ధైర్యం చేయలేదు తెరాస నేతలు.

కేకే వ్యాఖ్యలను ఎవరూ ఖండించకపోతే.. తెలంగాణ సాధించిన క్రెడిట్ తన తండ్రి కేసీఆర్ కు పూర్తిగా దక్కదని భావించాడామో లేక సీనియర్ నేత కేకే కు సమాధానం చెప్పడానికి ఇదే తగిన సమయమని భావించాడో తెలియదు గానీ… ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన దీక్షా దివస్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరు అవునన్నా, కాదన్నా తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిన ఘనత పార్టీ అదినేత చంద్రశేఖరరావుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు.

తెరాసలో తెరలేసిన క్రెడిట్ వివాదం టీ కప్పులో తుఫాన్ లా ముగిసిపోతుందా.. ? లేదా చినిగి చినిగి గాలివానలా మారుందా.. ? ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, జాతీయ పార్టీ కాంగ్రెస్ లో పెద్దన్న పాత్ర వహించిన కేకే లాంటి సీనియర్ నేతకు ఉపప్రాంతీయ పార్టీలోని సెకెండ్ గ్రేడ్ నాయకులతో సటైర్ వేయించుకోవాల్సిన కర్మ ఏమిటో మరీ..?