విశాఖ ప్రమాదం : గ్యాస్‌ లీకేజీ ఘటనపై కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ కావడం వలన వేలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ఆరుగురు వరకు మరణించారని, వందలాది పశువులు ఇప్పటికే చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. అక్కడ చోటు చేసుకున్న పరిమాణాలను వీడియోల్లో చూస్తే షాక్‌కు గురయ్యాయనని ఆయన పేర్కొన్నారు. ఈ వాయువు లీకేజీ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు కేటీఆర్‌. ఇదో భయంకరమైన సంవత్సరం అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కంపెనీనుంచి గ్యాస్ లీక్ కావడంపై స్థానికులు మండిపడుతున్నారు. కంపెనీ ఎలాంటి సేఫ్టీ తీసుకోలేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఈ కంపెనీ నుంచి లీకైన ఈ గ్యాస్ ప్రజలపై షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు.

కళ్ళు మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంపై ఇబ్బందులు, ఉదరసంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ఇక లాంగ్ టర్మ్ విషయానికి వస్తే నాడి వ్యవస్థపైనా, మూత్రపిండాలపైనా దీని ప్రభావం ఉంటుంది. అదే విధంగా తలనొప్పి, డిప్రెషన్, బలహీనత, క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.