తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం కరోనా బైర్నే పడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కరోనా బారినపడగా..తాజాగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు. హరీశ్ కు కరోనా రావడంపై కేటీఆర్ స్పందించారు. ‘బావా కరోనా నుంచి త్వరగా కోలుకో. ఇతరుల కంటే నీవు త్వరగా కోలుకుంటావనే నమ్మకం నాకుంది’ అని ట్వీట్ చేశారు.
Get well soon Bava. I am sure you’ll recover faster than others ? https://t.co/nq1hVnMkz6— KTR (@KTRTRS) September 5, 2020