భారత్ కు భారీ పెట్టుబడులు : కేటీఆర్


కరోనా సంక్షోభంలోనూ భారత్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. దేశాలకు ర్యాంకులు కేటాయించినట్లే తెలంగాణకు కూడా ప్రత్యేకంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులు ఇవ్వాల్సి వస్తే ప్రపంచంలోనే మొదటి 20 స్థానాల్లో రాష్ట్రం ఉంటుందన్నారు.

భారత్‌లో సులభతర వాణిజ్యం పట్ల విదేశీ పెట్టుబడిదారుల్లో వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయని.. అయినప్పటికీ తెలంగాణ లాంటి పలు రాష్ట్రాలు సులభతర వాణిజ్యంలో దూసుకుపోతున్నాయని కేటీఆర్‌ చెప్పారు. విదేశీ పెట్టుబడిదారులు భారతదేశాన్ని స్థూలంగా కాకుండా రాష్ట్రాల కోణాల్లోంచి చూడాల్సిన అవసరం ఉందన్నారు.