Site icon TeluguMirchi.com

రాహుల్ గాంధీకి అదిరిపోయే పంచ్ ఇచ్చిన కెటిఆర్


సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభలో ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాందీ కేసీఆర్ కుటుంబ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం ఒక కుటుంబం కోసమే చేశారా? నాలుగు కోట్ల ప్రజల పోరాటం ఒక కుటుంబం కోసమేనా?అని నిప్పులు చెరిగారు రాహుల్ .

రాహుల్ గాందీ చేసిన విమర్శలపై ఇప్పుడు మంత్రి కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు కుటుంబ పాలన గురించి రాహుల్ ప్రసంగించడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీల చిత్రాలను తన ట్వీట్లతో జత చేసి, కాంగ్రెస్‌ పార్టీ వారా కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నదని పంచ్ ఇచ్చారు. ప్రజలలో విశ్వాసం లేని కొందరు కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన ప్రసంగాన్ని రాహుల్ చదివారని ఎద్దేవ చేసిన కేటీఆర్ .. అవినీతి గురించి స్కాంగ్రెస్‌ లీడర్లు మాట్లాడటం పెద్ద జోక్‌..’’ అని విమర్శించారు.

Exit mobile version