బిజెపిపై నిప్పులు చెరిగిన కేటీఆర్


కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. భారత్ రెండు పార్టీల వ్యవస్థ కాదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని , అధికారం అంతా ఢిల్లీలో కేంద్రీకృతమై ఉందని, అది సరికాదని అందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచనను తీసుకొచ్చారని, అది మంచి పరిణామాలకే దారి తీస్తుందని చెప్పారు కేటీఆర్.

కేంద్రం నుంచి ఈ మూడున్నరేళ్లలో ఒక్క పైసా కూడా అదనంగా తెలంగాణకు రాలేదని, విభజన చట్టంలో చెప్పిన విధంగా ఒక్క ఇని‌స్టిట్యూట్‌ను కూడా ఇవ్వలేదని, ఏపీకైనా కొన్ని ఇచ్చారు కానీ తెలంగాణకు మాత్రం ఒక్కటైనా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రధానితో పాటు అనేకమంది మంత్రులను కలిసి విన్నవించామని, అయినా మార్పు రాలేదని, మాకెదురైన అనుభవమే ఆంధ్రామిత్రులకు కూడా ఎదురైనట్టుంది. అందుకే వారు బయటకు వచ్చారు. నిజంగా చెప్పాలంటే.. ఎన్డీయేకు ఆ కూటమిలో ఎవరూ మిగలలేదని, ఇప్పుడైనా వారు అలోచించుకోవాలని చెప్పుకొచ్చారు.