హైటెక్ సిటీ లో అండర్గ్రౌండ్ రోడ్ ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద రూ.66.59 కోట్ల తో నిర్మించిన ఆర్.యు.బి ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామా రావు ప్రారంభించారు. దాదాపు 410 మీటర్ల పొడవు, 20 .60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్.యూ.బి ప్రారంభంతో తీవ్రమైన ట్రాఫిక్ కలిగిన హై-టెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్. రైల్వే స్టేషన్ మార్గంలో ఏవిధమైన అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ వెళ్లే అవకాశం ఏర్పడింది.

హై -టెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్. రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభం కావడం ఈ ప్రాంత వాసులకు మరింత వెసులుబాటు అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్షి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, డిప్యుటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.