తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు అనే విషయం తెల్సిందే. తన శాఖలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ట్విట్టర్‌లో ఎవరైనా తన సాయం కోరినా, తన గురించి స్పందించిన వారికి వెంటనే సమాధానం ఇస్తూ ఉంటాడు. తాజాగా రాజు అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా మాజీ ఫుట్‌బాల్ దిగ్గజం, జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బీర్ బహదూర్ షా ప్రస్తుత పరిస్థితిని కేటీఆర్‌కు తెలియజేశాడు. రాజు ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ వెంటనే సాయం చేసేందుకు సిద్దం అయ్యారు. పుట్ బాల్ దిగ్గజం బీర్ బహదూర్ షాకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
బీర్ బహదూర్ కుటుంబ పోషణ కోసం 2002లో చాట్ బండిని మొదలు పెట్టారు. రెండు సంవత్సరాల క్రితం రోడ్డు మీద ఉన్న బీర్ బహదూర్ బండిని తొలగించారు. ఆ సమయంలో కేటీఆర్ స్పందించి బీర్ బహదూర్‌కు కొంపల్లిలోని బాలాజీ హాస్పిటల్ వద్ద చాట్ బండి పెట్టుకునేందుకు అనుమతించారు. అయితే మరోసారి ఆ చాట్ బిండిని జీహెచ్‌ఎంసీ అధికారులు ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు. వయస్సు మీద పడుతున్న ఈ సమయంలో బీర్ బహదూర్‌కు వచ్చిన కష్టంకు చెలించిన కేటీఆర్ నెలకు 10, 000 పెంన్షన్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. బీర్ బహదూర్‌తో పాటు మరో 9 మందికి కూడా పెన్షన్ ఇచ్చేందుకు కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. కేటీఆర్ మంచి మనస్సుకు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.