Site icon TeluguMirchi.com

రఘునందన్ అంత పెద్ద నాయకుడా ..!?

ktr-trs_1.jpg.crop_displayటీఆర్ఎస్ బహిష్కృత నేత రఘునందన్ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎట్టకేలకు పెదవి విప్పారు. పార్టీపైనా, ముఖ్యంగా హరీశ్ రావుపై రఘునందన్ గత రెండ్రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ.. రఘునందన్‌రావు అవకాశవాది అని ఆరోపించారు. రఘునందన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేదిలేదని, పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు తమ కుటుంబంలో విబేధాలు ఉన్నట్టు అపోహలు సృష్టిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మీడియాలో వస్తున్నట్టుగా తమ కుటుంబంలో ఎలాంటి పొరపొచ్చాలు రాలేదని వివరణ ఇచ్చారు. రఘునందన్ విషయంలో మీడియా అనవసర ప్రాధాన్యమిస్తోందని ఇది సరైన వైఖరి కాదని అన్నారు. మీడియాలో రఘునందన్ పై  వస్తున్న కధనాలు, ఇంటర్వ్యూ లు చూస్తుంటే ఆయన అంత పెద్ద నాయకుడా ..!? అని ఎద్దేవా చేశారు. . రఘునందన్ విషయంలో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు.

Exit mobile version