కేటీఆర్ కొంపముంచారు

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ గెలుపుపై ధీమాగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతంగా చేయించుకొన్న సర్వేలని చూసి మురిసిపోతున్నారు. అయితే, ఇదంతా బూటకపు సర్వేలు అన్న ప్రతిపక్ష పార్టీల విమర్శలకి ఇప్పుడు ఆధారం దొరికింది. ఇటీవలే వరంగల్ పర్యటనకి వెళ్లిన మంత్రి కేటీఆర్.. వరంగల్ అర్భన్ కలెక్టరేట్ సమీక్షాఅ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి మంత్రి కేటీఆర్ షాక్ తిన్నారు.

రూ. 300కోట్ల అభివృద్ధిపై ప్రజలకి ఏం సమాధానం చెబుతారు ? ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, స్థానిక టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియోలు మీడియాలోనూ ప్రసారమయ్యాయి. మంత్రి కేటీఆర్ మాటలకి మరో డిప్యూటీ సీఎం కడియం కూడా గొంతు కలిపారు. దీంతో.. టీఆర్ ఎస్ నేతలు గొంతెల్లబెట్టారు.

ఈ ఒక్క సంఘటనతో తెలంగాణ అసలు అభివృద్ధి జరగడం లేదని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలకి మంచి అస్త్రం దొరికినట్టయ్యింది. స్వయంగా టీ-మంత్రి, టీఆర్ ఎస్ లో నెం.2గా చెపుకొనే కేటీఆర్ నే అభివృద్ధి జరగలేదని చెప్పడంతో.. వరంగల్ టీఆర్ ఎస్ స్థానిక నేతల్లో వణుకుపుడుతోంది. దీనికి తోడు.. ఈ నెల 22న సీఎం కేసీఆర్ వరంగల్ విచ్చేయనున్నారు. కొడుకు కేటీఆర్ అందజేసిన సమాచారంతో.. వరంగల్ టీఆర్ ఎస్ నేతల తాట తీస్తాడనే ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి.. బహిరంగంగా అభివృద్ధిపై స్పందించిన మంత్రి కేటీఆర్ కొంపముంచినట్టే కనబడుతోంది. అస్త్రాలు లేని ప్రతిపక్ష పార్టీలకి మంత్రి కేటీఆర్ అద్భుతమైన అస్త్రాన్ని రెడీ చేసి ఉంచారు. ఇక, యుద్ధం చేయడమే ప్రతిపక్షాల పని.