Site icon TeluguMirchi.com

కేటీఆర్ ను ఫిదా చేసిన చిన్నారి..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఏ రేంజ్ లో విజృభిస్తుందో తెలియంది కాదు..ఇప్పటివరకు రాష్ట్రంలో 269 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా కట్టడి లో భాగంగా ప్రతి ఒక్కరు తమవంతు విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి తన కిడ్ బ్యాంకు లో దాచుకున్న డబ్బును విరాళంగా ఇచ్చి కేటీఆర్ ను ఫిదా చేసింది.

ఆ ఫోటోలను ఆమె తండ్రి ట్విట్టర్ లో పోస్ట్ చేసి కేటీఆర్ గారికి టాగ్ చేసారు. “అన్నయ్య నా కూతురు అందరు టీవీ లో చేస్తున్న సాయం చూసి తాను దాచుకున్న డబ్బుని రూ.440 విరాళంగా ఇచ్చింది. తనకు మీరంటే అభిమానం అని టాగ్ చేసారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఆ పోస్ట్ ను రీట్వీట్ చేసి థాంక్స్ అద్విక అని పోస్ట్ చేసారు.

Exit mobile version