‘నల్లారి’.. నిలువుదోపిడీ కనిపించట్లేదా..?

KTR-TRSముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా విరుచుపడ్డారు. గత రెండేళ్లలో సీఎం పలు భూదందాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో అనేక భూదందాలు జరిగాయని.. అందులో ముఖ్యమంత్రి భాగస్వామేనని కేటీఆర్ ఆరోపించారు. జూబ్లిహిల్స్ లోని నందగిరిహిల్స్ లో అత్యంత విలువైన భూమిని ముఖ్యమంత్రి.. అమరేందర్ రెడ్డి అనే తన బినామీ ద్వారా సుమారు రెండెకరాల స్థలాన్ని అతి తక్కువ ధరకు పొందారని, ఈ భూమి వేలం పాటలో ఎవరు పాల్గొనకుండా చూసి.. తమకు దక్కేలా చూసుకున్నారని ఆయాన పేర్కొన్నారు. కిరణ్ భూదందాలను కనబడటం లేదా.. ? అని ఆయన ప్రశ్నించారు. కాగా, సీఎం తన సొంత జిల్లాకు దాదాపు 500కోట్లపైగా మంజూరు చేశారని ఆయన అన్నారు.