మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. . ముస్తాబాద్ మండలం గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ తనిఖీ చేశారు. పలుచోట్ల స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే మందు అని.. రానున్న రెండు వారాలు కూడా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మర్కజ్ ఘటన లేకపోతే జిల్లాల్లో ఒక్క కేసు కూడా ఉండేది కాదన్నారు. వేములవాడలో ఓ యువకుడికి కరోనా సోకిందని.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారన్నారు.