Site icon TeluguMirchi.com

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్..

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్యటించారు.ఎడతెరిపిలేకుండా కురిసిన వానతో జంటనగరాలు చిగురుటాకులా వణికిపోయాయి. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని చోట్లా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అపార్ట్‌మెంట్ సెల్లార్లన్నీ నీటమునిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎల్బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని బైరామ‌ల్‌గూడ‌లో పర్యటించారు.

హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ ప‌ర్యటించారు. వ‌ర‌ద ప్రాంతాల్లోని ప‌రిస్థితుల‌ను ప‌ర్యవేక్షించారు. సాగర్ రింగ్ రోడ్డులోని బైరామల్ గూడ చెరువు ప్రాంతాన్ని కేటీఆర్ పరిశీలించారు. కాల‌నీ స‌మ‌స్యల‌ను ప్రజ‌ల‌ను అడిగి మంత్రి తెలుసుకున్నారు. భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ,రేపు ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీల ఆన్‌లైన్‌ క్లాసులు కూడా రద్దు చేశారు.

Exit mobile version