3500 కోట్ల వ్యయంతో సీవరేజ్ డ్రైనేజి ఆధునీకరణ పనులు – మంత్రి కేటీఆర్

సీవరేజ్ ఆధునీకరణ పనులను చేపడుతున్నట్టు రాష్ట్ర మున్సిపల్ శాకా మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు. కూకట్పల్లి నియోజకపరిధిలో నేడు దాదాపు రూ 71 .49 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 5 ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కైతలాపుర్ లో వీడీసీసీ రోడ్డు నిర్మాణపనులు ప్రారంభించిన సందర్బంగా మంత్రి స్థానికులతో మాట్లాడారు. గత టర్మ్ లో ఏవిధంగానైతే రూ. 3000 కోట్ల తో శివారు ప్రాంతాలకు తాగునీటిని అందించి నీటి కొరత లేకుండా చేసామో అదేవిధంగా ఈ టర్మ్ లో రూ 3500 కోట్ల వ్యయంతో శివారు ప్రాంతాలలో డ్రైనేజి, సీవరేజ్ ఆధునీకరణ పనులను చేపడున్నట్టు తెలియచేసారు. నగరంలో వర్షాల వల్ల తిరిగి కాలనీలు, బస్తీలు ముంపుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. కైతలాపుర్ లోని ట్రాన్స్ఫర్ స్టేషన్ ను ఆధునీకరించడంద్వారా స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని హామీనిచ్చారు.

కరోనా పూర్తిగా పోలేదు, మరోసారి లాక్ డౌన్ రావద్దంటే మాస్కలు తప్పనిసరిగా ధరించాలని నగర పౌరులకు కేటీ రామా రావు విజ్ఞప్తి చేశారు. కైతలాపుర్ లో గతంలో పేదలకు నిర్మించి ఇచ్చిన గృహాలకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు..