రీల్ కాదు రియల్ నాయకన్ కావాలి

ద్రవిడ రాజకీయాల్లోకి మరో సినీనటుడు ప్రవేశించారు. హీరో కమల్‌హాసన్‌ ‘ మక్కల్‌ నీది మయ్యం’ అనే పేరుతో నూతన రాజకీయపక్షాన్ని ప్రారంభించారు.తమిళనాడు సాంస్కృతిక రాజధాని మధురైలో అశేష అభిమానుల మధ్య ఆయన రాజకీయపక్షాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.వెండితెరపై విలక్షణ నటుడిగా పేరు పొందిన ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడంతో రాష్ట్ర రాజకీయాలపై ఏ విధమైన ప్రభావం చూపించనున్నారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇదిలాఉంటే కమల్ రాజకీయ ఎంట్రీ పై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. మధురైలో జరిగే మీ పార్టీ లాంచింగ్ కి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అనివార్య కారణాల వలన ప్రారంభోత్సవానికి రాలేకపోతున్నాను. కొత్త ఇన్నింగ్స్ లోను మీరు రాణించాలి. రీల్ నాయకన్ గానే కాదు రియల్(జన జీవితంలోను) నాయకన్ గాను మీరు రాణిస్తారని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

దీనికి కమల్ థ్యాంక్యూ కేటీఆర్ జీ. ఈ రోజు మిమ్మల్ని మిస్ అయిన, భవిష్యత్ లో మా పార్టీ ఫంక్షన్స్ కి హాజరు అవుతారని ఆశిస్తున్నాను. మీ బిజీ షెడ్యూల్ మధ్య మాకు కొంత సమయం కేటాయించండి అని కమల్ రీ ట్వీట్ చేశారు.