Site icon TeluguMirchi.com

దుబ్బాక విజయం ఫై కేటీఆర్ స్పందన

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి స్వల్ప తేడాతో తెరాస ఫై విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ చెందిన సోలిపేట సుజాతపై 1,118 ఓట్లతో గెలుపొందారు.

ఈ విజయం ఫై కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ..దుబ్బాక ఫలితం తాము ఆశించిన విధంగా రాలేదని అన్నారు. ఆ స్థానంలో ప్రజలు ఇచ్చిన తీర్పే తమకు శిరోధార్యం అని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకారం తమ పని తాము చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పారు. ఒక రకంగా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు తమకు, తమ పార్టీ నేతలకు ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు. తప్పకుండా ఈ తీర్పును సమీక్షించుకుంటామని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్‌కు ఓటు వేసిన 60 వేల పైచిలుకు ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

‘‘ఈ ఆరేళ్లలో ఎన్నో విజయాలను మేం గెల్చుకున్నాం. ఇప్పుడు ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. ఈ ఓటమి మా పార్టీ నేతలకు ఓ అప్రమత్తత లాంటిది. మేం ఏం తప్పులు చేశామో కూర్చొని సమీక్షించుకుంటాం. ఈ తీర్పును తప్పకుండా సమీక్షించుకుంటాం. పార్టీ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు. ఎప్పుడూ విజయాలకు గర్వపడం. అపజయాలకు కుంగిపోము.’’ అని కేటీఆర్ అన్నారు.

Exit mobile version