అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్


హైదరాబాద్‌లో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అదుపులోకి తీసుకుంది. గీతను అరెస్ట్ చేసిన సీబీఐ విచారణ నిమిత్తం ఆమెను బెంగుళూరుకు తరలించింది. దీనికి కారణం ఆమె పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.42.79కోట్లు రుణం తీసుకుని,ఎగ్గొట్టడమేనని సమాచారం. గతంలో విఘ్నేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో గీత దంపతులు ఈ లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఈ రుణాన్ని ఆమె తిరిగి చెల్లించలేదని పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ అధికారులు గతంలో ఆమెను తన భర్తతో సహా విచారించారు. కొత్తపల్లి గీత 2014 ఎలక్షన్స్‌లో వైసీపీ అభ్యర్థిగా పోటి చేసి ఎంపీగా గెలుపొందారు. అనంతరం ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేరారు.