Site icon TeluguMirchi.com

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశ‌య్య మృతి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (89) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. శనివారం ఉదయం ఒక్కసారిగా బీపీ డౌన్ కావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైద‌రాబాద్ లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అయితే…. ఆస్పత్రికి తీసుకెళ్లే దారిలోనే రోశయ్య చనిపోయినట్లుగా నిర్ధారించారు వైద్యులు.

రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య 2004లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు నిర్వహించారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించి మన్నలను అందుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మృతిఫై రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు సంతాపం తెలిపుతున్నారు.

Exit mobile version