యూటీకి ఒప్పుకొనే ప్రసక్తే లేదు!

Kodandaramకేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) అనేది బ్రిటిష్ కాలం నాటి భావన అని, బ్రిటన్ కేంద్రంగా పాలనను కొనసాగించేందుకు, దేశంలోని సొత్తును దోచుకొనేందుకే యూటీ విధానాన్ని అమలుపరిచారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. సాంస్కృతికంగా, భౌగోళికంగా కలవని ప్రాంతాన్ని యూటీగా చేస్తా రని.. హైదరాబాద్ అలాంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి దానిని అంగీకరించే ప్రసక్తే లేదని కోదండరామ్ తేల్చిచెప్పారు.

తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న ‘శాంతి సద్భావన దీక్ష’ కు హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నాటి యూటీ భావనను ఇప్పుడు కొందరు డిమాండ్ చేస్తున్నారని.. పూర్తిగా నష్టదాయకమైనది కాబట్టే ఆ డిమాండ్‌ను తిరస్కరిస్తున్నామని చెప్పారు. భిన్న సంస్కృతులు ఉన్నందున రాయల తెలంగాణ కూడా సరికాదన్నారు. ప్రజల రక్షణ అనేది కాగితాల్లో ఉండాలని ఏమీ లేదని, ప్రజలు సఖ్యతతో ఉంటే చాలని కోదండరాం ఈ సంధర్బంగా చెప్పారు.