కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి చిన జీయర్ స్వామికి ఆహ్వానం

రైతన్న సాగునీటి కష్టాలు తీర్చే కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ సిద్ధమైంది. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రిజర్వాయర్ను ప్రారభించబోతున్నారు. ఇప్పటికే అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ రిజర్వాయిర్ ప్రారంభోత్సవానికి చిన జీయర్ స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు.

సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు సాగు నీరందనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో దాదాపు రూ.1,600 కోట్ల వ్యయంతో కొండ పోచమ్మ ప్రాజెక్టు చేపట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ఐదు జిల్లాల పరిధిలోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యం కలుగుతుంది. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం పరిధిలోని దాదాపు 26 వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తారు.