Site icon TeluguMirchi.com

‘జన సేన ‘ లో కోన కు సీటు ఖరారు..?

kona-janasenaసినీ నటుడు & జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 నాటికీ పూర్తి రాజకీయాల్లోకి రాబోతున్న సంగతి తెల్సిందే..ఈ లోపు తనకు వీలయిన చిత్రాలు పూర్తి చేసి , ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు..కాగా జనసేన పార్టీ లో ప్రముఖ రచయిత కోన వెంకట్ కు సీటు ఖరారయ్యిందనే వార్తలు ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి..

పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయినా కోన వెంకట్ , తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “తన అంతిమ లక్ష్యంగా రాజకీయాల్లో ఓ ఎమ్మెల్యే గానీ, ఎంపీ కావాలన్న అభిలాష ” అంటూ చెప్పడం వల్ల కోనవెంకట్ కు జనసేన పార్టీ సీటు ఇస్తుందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కోన ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే అది జనసేన తోనే వస్తాడని అందరూ నమ్ముతున్నారు..మరో కోన నిజంగానే జనసేన లో కలుస్తాడా..? లేదా అనేది చూడాలి మరి.

Exit mobile version