ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. త్వరలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తో పాటు భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ఘటనలు వెలుగులోకి రాగ..తాజాగా విజయవాడ లో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్‌పై దాడి జరిగింది.
ఇంటి నుంచి టీడీపీ కార్యాలయానికి బయల్దేరుతుండగా బయట గేట్ దగ్గరే గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేసారు. ఈ దాడి లో కార్ అద్దాలు ధ్వసం కాగా..పట్టాభికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయన సెల్‌ఫోన్ కూడా ఈ దాడిలో ధ్వంసమైంది. సుమారు 10 మంది దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిపై పట్టాభి పోలీసులకు ఫిర్యాదు చేశారు.