తానూ రాజకీయ సన్యాసంకు రెడీ

గత కొన్ని రోజులుగా మంత్రి కేటీఆర్‌ మరియు టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల మద్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెల్సిందే. పొలిటికల్‌ ఛాలెంజ్‌లు చేసుకుంటున్న వీరిద్దరి మద్యలోకి మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చాడు. తాజాగా తెలంగాణలో త్వరలో జరుగబోతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుంటే కేటీఆర్‌ రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూ ప్రకటించాడు.

అదే సమయంలో కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుంటే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాను అంటూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా ప్రకటించాడు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు తాను కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నాడు. దమ్ముంటే కేటీఆర్‌ ఛాలెంజ్‌కు నివాలి అంటూ కోమటిరెడ్డి సవాల్‌ విసిరాడు. మరి కోమటిరెడ్డి సవాల్‌కు కేటీఆర్‌ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.