కాంగ్రెస్ కు మిగిలేది ఓటమే…

komati reddyకాంగ్రెస్ నేతల మాటలు వారిలోని విభేదాలను బయటపెడుతున్నాయి. తాజాగా టీకాంగ్రెస్ నేతలు సీంఎంను ఎందుకు విమర్శించడంలేదంటూ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సమావేశాలు నిర్వహించడమే కానీ సీఎం తీరును ఏ ఒక్కరూ ఖండించడంలేదేమని ప్రశ్నించారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషిచేయాల్సింది పోయి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి సంతకం లేకుండానే హైదరాబాద్ శివారు గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారని…ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అయినా సీఎం తీరును ఏఒక్కరూ ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. సభలు, సమావేశాలు ఎన్ని నిర్వహించినా తెలంగాణ ప్రక్రియను తొందరగా పూర్తిచేయకపోతే… కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చినా వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని జోస్యం చెప్పారు…