టీ-మంత్రులు రాజీనామా చేయాలి.. !

komatireddy venkat reddyతెలంగాణ ఏర్పాటును ఆపేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నించడానికి నిరసనగా.. తెలంగాణ మంత్రులందరూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే, రేపు జరగబోయే కేబినెట్ సమావేశాన్ని టీ-మంత్రులు బహిష్కరించాలని ఆయన సూచించారు. లేదంటే.. టీ-మంత్రుల ఇళ్ల ముందు ఆందోళనకు దిగాల్సి వస్తోందని కోమటిరెడ్డి హెచ్చరించారు. ఓ వైపు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను ప్రకటించిందన్న ఆనందంలో టీ-మంత్రులు వుంటే..టీ-మంత్రులు రాజీనామా చేయాలని కోమటి రెడ్డి డిమాండ్ చేయడం విశేషం.