Site icon TeluguMirchi.com

సీఎం జైలుకు వెళ్లడం ఖాయం !

cm kiranరాష్ట్ర విభజనకు సంబంధించి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ, అవినీతి ఫైళ్లపై సీఎం కిరణ్ సంతకాలు రోజురోజూకు పెరిగిపోతున్నాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గరపడుతున్న కొద్దీ అవినీతి ఫైళ్లపై సీఎం జోరుగా సంతకాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంతో పాటు సీమాంధ్ర నేతలు కొందరు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

Exit mobile version