మీరే గట్లంటే.. మేమెట్లనాలే.. !

Kodandaramహైదరాబాద్ లో 10 శాతం వున్న వారే… హైదరాబాద్ మాది అంటే.. 90 శాతం వున్నతాము ఏమనాలని టీ-పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. కోదండరాం ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గుప్పెడు మంది దోపిడీదార్లకే నష్టమని.. సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది వుండదన్నారు. హైదరాబాద్‌ లోని ప్రతీ బస్తీ బంజారాహిల్స్ లా కావాలని ఆయన ఆకాంక్షించారు. హెరిటేజ్ తో తెలంగాణ పాల వ్యాపారుల పొట్టకొట్టారని కోదండరాం మండిపడ్డారు. హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్బాగమేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు.