Site icon TeluguMirchi.com

జూ. ఎన్టీఆర్ ఫై నాని సంచలన వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ లో చంద్రబాబు , అయన భార్య ఫై వైసీపీ నేతలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారని చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారు. దీంతో తెలుగుదేశం నేతలు , నందమూరి కుటుంబ సభ్యులే కాదు జాతీయ స్థాయిలో రాజకీయ నేతలు వైసీపీ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. జూ ఎన్టీఆర్ స్పందన పట్ల పలువురు టిడిపి నేతలు తప్పు పట్టారు. కొడాలి నాని , వంశీ ని ఎన్టీఆర్ తప్పుపట్టడం లేదని , వారిని హెచ్చరించలేకపోయారని కామెంట్స్ చేసారు.

ఈ తరుణంలో నాని స్పందించారు. జగన్ చెబితే వింటాం కానీ.. జూనియర్ ఎన్టీఆర్ చెబితే వినేందేంటూ ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తమను కంట్రోల్ చేయడమేంటిని ప్రశ్నించారు. ఒకప్పుడు నందమూరి కుటుంబంతో కలిసి ఉన్నామని.. విబేధాలతో బయటకు వచ్చామని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తమకేం సంబంధం లేదంటూ తెలిపారు.

Exit mobile version