Site icon TeluguMirchi.com

పేకాట క్లబ్బుల విషయంలో నాని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ మంత్రి కొడాలి నాని మరోసారి వివాదస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. సోమవారం నాటి మీడియా సమావేశంలో.. పేకాట క్లబ్బులో మీ ప్రధాన అనుచరులు ఉన్నారట కదా అని ప్రశ్నించగా.. ”ఏమో ఉంటే, ఒకరిద్దరు ఉంటారు. ఉంటే ఏమవుతుంది? ఏమైనా ఉరి శిక్ష వేస్తారా? తీసుకు వెళతారు. కోర్టుకు వెళతారు. ఫైన్ కట్టి వచ్చేస్తారు. ఏ శిక్ష వేస్తారు? పట్టుకుంటే ఫైన్ కడతారు. మళ్లీ వెళతారు. అందుకే కదా విచ్చలవిడిగా ఆడేది. భయపడంది అందుకే కదా.

దీన్ని అరికట్టేందుకే వైఎస్ జగన్ గ్యాంబ్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఉరిశిక్షలు ఏమైనా ఉన్నాయా? నా తమ్ముడే ఉంటే ఉండొచ్చు. ఏం ఉరేస్తారా? దీనిపై ముఖ్యమంత్రిని అడగకపోతే ఏమవుతుంది? యాభయ్యో.. వంద రూపాయలో ఫైన్ వేస్తారు? దానికి ముఖ్యమంత్రి దగ్గరకి పరిగెత్తుకు వెళ్లాలా? నేను రోడ్డు పనుల కోసం సీఎంను కలిశాను. ప్రజల కోసమే కలిశా. గుడివాడ ప్రజలు నాలుగు సార్లు గెలిపించారు. వారి పనుల కోసమే వెళతాను. పేకాట ఆడేవారిని రోజూ నాలుగైదు చోట్ల పోలీసులు పట్టుకుంటారు. ఎక్కడో ఓ చోట పట్టుకుంటూనే ఉన్నారు. జనరల్‌గా తనిఖీలు జరుగుతుంటాయి. నిన్నటి ఘటనతో నామీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు” అంటూ సమాధానం ఇచ్చారు.

Exit mobile version