Site icon TeluguMirchi.com

వెనక్కు తగ్గేది లేదు..!!

kishan-reddyతెలంగాణ ఏర్పాటు విషయంలో భాజాపా ఇంచు కూడా వెనక్కు తగ్గేది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషర్ రెడ్డి స్పష్టం చేశారు. టీ-పై భాజాపా వెనక్కు తగ్గిందని కాంగ్రెస్ విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు భాజాపా సంపూర్ణ మద్ధతు ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్ఠానాన్ని సైతం ధిక్కరిస్తున్న సీఎం కిరణ్ ను వెనకేసుకొస్తున్న దిగ్విజయ్ సింగ్ కు సిగ్గు లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తెదేపా పొత్తు ఇంకా ఖరారు కాలేదని కిషన్ రెడ్డి తెలిపారు.

Exit mobile version