Site icon TeluguMirchi.com

జనవరిలో కిరణ్ కొత్త పార్టీ.. ?

cm-kiran7

రాష్ట్ర విభజన అంశాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని యోచిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ’విభజన ముసాయిదా’పై అభిప్రాయాన్ని చెప్పేందుకు గానూ.. జనవరి 23వరకు రాష్ట్రపతి గడువును కూడా ఇచ్చారు. అయితే, అసెంబ్లీ టీ-బిల్లుపై చర్చను మొదలుపెట్టినప్పటికినీ.. ఆ దిశగా చర్చ మాత్రం జరగలేదు. సభలో ఇరుప్రాంత నేతలు నినాదాలతో రచ్చ చేయడంతో.. సభ సజావుగా సాగనూ లేదు.

రెండో దఫా అసెంబ్లీ సమావేశాలు జనవరి 3న ప్రారంభం కానున్నాయి. రెండో దఫా(జనవరి3 నుంచి జనవరి11) లో కూడా టీ-బిల్లుపై చర్చ సజావుగా జరగని పక్షంలో.. మూడో దఫా సమావేశాలకు అవకాశం ఇవ్వకుండా.. టీ-బిల్లు కోసం వీలైనంత త్వరగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించి.. లాంఛనాన్ని పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది. దానికి.. అనుగుణంగానే కేంద్రం వ్యూహరచనలో మునిగిపోయిందన్నది ఢిల్లీ పెద్దల మాట. మరోవైపు, విభజనవైపు కేంద్రం ఎంతైతే వడివడిగా అడుగులు వేస్తోందో.. అంతే వడిగా కిరణ్ కొత్త పార్టీపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికి ’జై సమైక్యాంధ్ర’ పేరుతో పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేశారట. పార్టీ గుర్తుగా ’బ్యాట్’ ను ఎంపిక చేసుకున్నారనే కథనాలు వస్తున్నాయి. అందుకు కావాల్సిన నిధులను సైతం సమకూర్చుకునే పనిలో వున్నారట సీఎం వర్గం. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు సీఎం కొత్త పార్టీ రూపకల్పన, తదితర అంశాల్లో కీలక పాత్రను పోషిస్తున్నారని సమాచారం. లగడపాటి రాజగోపాల్ పార్టీ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే.. తాజాగా.. ముఖ్యమంత్రి ’ఆఖరు బంతి’ ఇంకా మిగిలే వుంది అనే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఆ ఆఖరు బంతే.. కొత్త పార్టీ అన్నమాట. అందుకే గతకొన్ని నెలలుగా సమైక్యాంధ్ర స్టార్ బ్యాట్స్ మెన్ ముఖ్యమంత్రి తనకు తాను సొంత బ్యాటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. విభజన ముసాయిదాపై అభిప్రాయాన్ని చెప్పేందుకు గానూ అసెంబ్లీ రాష్ట్రపతి ఇచ్చిన గడువు ముగయడమే తరువాయి. కిరణ్ కొత్త పార్టీ ఆవతరించనుందన్న వార్తలు రాజకీయాలో హల్ చల్ చేస్తున్నాయి.

సీమాంధ్ర స్టామినాతో.. వచ్చే ఎన్నికల్లో మరోసారి గట్టేక్కాలని చూస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామంది కిరణ్ వైపు చూస్తున్నారు. కొత్తపార్టీ రావడమే.. ఆలస్యం బ్యాటిపట్టి బ్యాటింగ్ చేయడానికి రెడీగా వున్నారు. కిరణ్ కొత్త పార్టీ వస్తోన్న వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియాలంటే.. మరో నెలపాటు ఆగాల్సిందే మరీ….!

Exit mobile version