Site icon TeluguMirchi.com

కిరణ్ లేఖాస్త్రం..!

cm kiranతెలంగాణపై తీర్మానం, బిల్లు రెండూ రావాలని కోరుతూ.. కేంద్రానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాసినట్లు తెలుస్తోంది. విభజన ప్రక్రియలో సంప్రదాయాలను పాటించాలని, తొలుత అసెంబ్లీ తీర్మానం చేసి.. ఆ తర్వాతే ముసాయిదా బిల్లు శాసనసభకు రావాలని కిరణ్ ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ లకు రాసిన లేఖలో పేర్కొన్నారన్నట్లు సమాచారం. గతంలో దిగ్విజయ్ సింగ్ తీర్మానం శాసనసభకు వస్తుందని ప్రకటించగా, షిండే బిల్లు మాత్రమే వస్తుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కిరణ్ అధిష్టానం దగ్గర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. ఏమీ చెప్పినా.. క్లారిటీగా చెప్పండి.. ఒకరు ఒక ప్రకటన మరొకరు దానికి వ్యతిరేక ప్రకటన చేయవద్దనే కిరణ్ కాస్త కటువుగానే ఢిగ్గీరాజాకు సూచించినట్లు సమాచారం. తాజాగా, కిరణ్ ఏకంగా ప్రధాని, రాష్ట్రపతికి తెలంగాణపై లేఖలు రాయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకొంది. అయితే, ముఖ్యమంత్రి లేఖాస్త్రం వెనక పెద్ద ప్లానే వుందంటున్నారు విశ్లేషకులు.. తెలంగాణపై తీర్మాణం, బిల్లు రెండు శాసనసభకు వచ్చిన యెడల వాటిని ఓడించే ప్రయత్నం చేయవచ్చనేది ఆయన ప్లాన్. అదీ సాధ్యంకాకపోతే.. తీర్మాణం, బిల్లు ఆమోదం విషయంలో కాలయాపన చేసి… విభజనకు కాలడ్దువేయవచ్చనేది కూడా కిరణ్ ప్లాన్ లోని భాగంగా కనిపిస్తోంది. మరో నెల రోజుల పాటు విభజన అడ్దుకున్నట్లయితే.. రాష్ట్రం సమైక్యంగానే వుంటుందని సీమాంధ్ర నేతలు ప్రకటించన విషయం తెలిసిందే. ఇక్కడ సరిగ్గా సీఎం కూడా ఇదే భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కిరణ్ వేసిన కాలయాపన ప్లాన్ లో అధిష్టానం చిక్కుకుంటుందా… ? లేదా విభజనపై నిర్ణయం తీసుకుంటున్నప్పుడు సీఎంను ఏమాత్రం సీన్ లోకి తీసుకోకుండా చేసిన మాదిరిగా తన పని తాను చేసుకుపోతుందా..? వేచి చూడాలి మరి. ఏదేమైనా.. ఈ సమైక్యాంధ్ర స్టార్ బ్యాట్స్ మెన్ అడుగులు మాత్రం సందుదొరికితే.. సమైక్యాంధ్ర వైపే పడుతున్నట్లు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version