Site icon TeluguMirchi.com

మస్లిజ్ పై తొడగొట్టిన సీఎం

ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డి దూకుడు ప్రదర్శించారు. మూడు ప్రతిపక్షాలు టీడీపీ, వైసీపీ, ఎంఐఎంలపై కిరణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట స్థాయి విస్తృత సమావేశ వేదికపై గంటకు పైగా చేసిన ప్రసంగంలో ప్రతిపక్షాలపై ఒంటికాలి మీద లేవడమే కాక.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి, కలిసికట్టుగా ఎన్నికలకు సన్నద్ధం కావాలంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. “వాళ్లవల్లే మాకు సీట్లు వచ్చాయి అంటున్నారు.. రెండు నుంచి ఏడు సీట్లు ఎలా పెరిగాయనుకుంటున్నారు.. రండి, హైదరాబాద్ లో చూసుకుందాం. చిన్నాచితకా పార్టీలకు భయపడేది లేదు” అని ఎంఐఎం ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా చంద్రబాబు సిద్ధపడతాడు. అధికార దాహంతో బాబు చేస్తున్న పాదయాత్రను ప్రజలు పట్టించుకోరు. దేశమంతా తిరిగినా ఆయన పాపం పరిహారం కాదని దయ్యబట్టారు. “జగనన్న సీఎం అయితే వడ్డీ లేని రుణాలు ఇస్తారట. ఇప్పుడు మనం ఇస్తున్నవేంటో! సంక్షేమ పథకాలకు వైఎస్ హయాం నాటి వేలకోట్ల బకాయిలను నేను అధికారంలోకి వచ్చాక తీర్చా” అని సీఎం తెలిపారు.
ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించింది ఆజాదేనన్నారు. ఈ రిజర్వేషన్లపై ఎంఐఎం, వైసీపీ సత్య ప్రచారాలు చే స్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ లౌకికవాదంపై ఎవరి కితాబూ అక్కర్లేదని, అల్పసంఖ్యాక వర్గానికి చెందిన మన్మోహన్ను ప్రధానిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని సీఎం చెప్పుకొచ్చారు. సీఎం ఎంఐఎంపై చేసిన ఎదురుదాడిని ఇక మీదట ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Exit mobile version