Site icon TeluguMirchi.com

అవిశ్వాస గండం నుంచి గట్తెక్కిన కిరణ్‌

kiran-government-survived-the-no-confidence-motionఎట్టకేలకు ముందే తెలిసిపోయిన నిర్ణయం ఖరారయింది. కిరణ్‌ సర్కారు వరుసగా రెండోసారి అవిశ్వాసం నుండి బయటపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు, లోక్‌సత్తా , నాగం జనార్ధన రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. డివిజన్ ఓటింగ్ కు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. అవిశ్వాసానికి అనుకూలంగా 58 ఓట్లు, వ్యతిరేకంగా 142 ఓట్లు రాగా 64 మంది సభ్యులు తటస్థంగా ఉండిపోయారు.

కిరణ్‌ సర్కారు గెలుపు తెదేపా తప్పుకోవడంతో దాదాపుగా ఖరారైన నేపథ్యంలో అందరి ఆసక్తి విప్‌ ను ధిక్కరిచే వారిపైనే పడింది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్‌ పార్టీ నుండి 9మంది, తెదేపా నుండి 6మంది ఎమ్మెల్యేలు ఆయా పార్టీలు జారీ చేసిన విప్‌ ధిక్కరించారు. అవిశ్వాసానికి అనుకూలంగా మద్దాల రాజేష్, పేర్నినాని, పెద్దిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవి, అమరనాథ్ రెడ్డి, సాయిరాజ్, జోగి రమేశ్, సుజయ్ రంగారావు, కొడాలి నాని, వనిత, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్లనాని ఓటు వేశారు. దాంతో శాసనసభలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. కాంగ్రెస్ వ్యతిరేకంగా తొమ్మిదిమంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. రెబెల్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, కోటం, వేణుగోపాల చారి ఓటింగ్ దూరంగా ఉన్నారు.

Exit mobile version