మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లా బరిజహారియా గ్రామంలో కిరణ్ అనే మహిళ ఆదివారం సాయంత్రం తన ఇంటి వద్ద పిల్లలతో కలిసి చలిమంట కాచుకుంటోంది.బిడ్డ ఆమె ఒడిలో కూర్చోగా మరో ఇద్దరు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత ఓ పిల్లాడిని నోట కరచుకుని అడవిలోకి పరుగులు తీసింది. వెంటనే కిరణ్ సైతం దాన్ని వెంబడించింది. కిలోమీటరు దూరంలో చిరుతను గుర్తించి, పోరాడి కుమారుడిని రక్షించింది. తల్లిబిడ్డలపై చిరుత దాడి చేస్తుండగా అంతలోనే గ్రామస్థులు వచ్చి దానిని తరిమేశారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. వారు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Home వార్తలు ఇతర రాష్ట్రాలు చంటి పిల్లాడ్ని లాక్కెళ్లిన పులి, పులితో పోరాడి పిల్లాడ్ని వెనక్కి తెచ్చుకున్న తల్లి