మరో భారతీయ మహిళకు కీలక బాధ్యతలు అప్పచెప్పిన బైడెన్

దాదాపు 20లక్షల మంది అమెరికా ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలను పర్యవేక్షించే ‘ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ (ఓపీఎం)’ విభాగానికి మహిళా అధినేతగా భారతీయ మూలాలున్న కిరణ్‌ అహూజా వ్యవహరించనున్నారు. 49 ఏళ్ల కిరణ్‌ అహూజాను ఓపీఎం హెడ్‌గా ఎంపికచేస్తూ అధ్యక్షుడు బైడెన్‌ గతంలోనే నామినేట్‌ చేశారు. అయితే, ఈ నామినేషన్‌పై సెనేట్‌లో మంగళవారం హోరాహోరీ ఓటింగ్‌ జరిగింది. ఓటింగ్‌లో 50–50 ఓట్లు పడ్డాయి