ప్రజా భవన్ వద్ద కిడ్నీ పేషేంట్స్ శాంతియుత నిరసన చేపట్టారు, అందులో ప్రభుత్వంపై తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా, వారు ప్రభుత్వాన్ని ప్రతి నెలా 10,000 రూపాయల పెన్షన్ అందించి, మెరుగైన వైద్య సేవలు కల్పించాలని కోరుతున్నారు. నిరసనలో పాల్గొన్న వారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరిలో ప్రజా భవన్‌లో వెళ్లి తమ సమస్యలను వివరించి విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. గత ప్రభుత్వం తమకు డయాలసిస్ కేంద్రాలు అందుబాటులో ఉంచి సహాయం చేసిందని వారు గుర్తుచేశారు, అయితే ప్రస్తుత
ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.