జనంలేని ‘మహాగణపతి’ నిమజ్జనం

మహాగణతి నిమజ్జనం అంటే హైదరాబాద్ అంత ట్యాంక్ బ్యాండ్ దగ్గరే ఉంటుంది. ఉదయం నుండే జనసంద్రం గా ఉంటుంది. ఇది గత ఏడాది వరకు..ఈ ఏడాది మాత్రం జనంలేని నిమజ్జనం అయ్యింది. కరోనా వైరస్ కారణంగా ఈసారి గణేష్ ఉత్సవాలు ఎలాంటి సందడి లేకుండా పూర్తి అయ్యాయి. అసలు గణేష్ పండగా వచ్చిందా అని కూడా తెలియకుండా అయిపొయింది.

ఇక కొద్దీ సేపటి క్రితం ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు గంగ‌మ్మ ఒడికి చేరాడు. ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న గ‌ణ‌నాథుడు ఎన్టీఆర్ మార్గ్ వ‌ద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నం. 4 వ‌ద్ద మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం విజ‌య‌వంతంగా పూర్త‌యింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర‌.. భ‌క్తుల సంద‌డి మ‌ధ్య ఐదారు గంట‌ల పాటు శోభాయమానంగా సాగింది. కరోనా వైరస్‌ సంక్రమణ క్రమంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి.