విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ నేత ఫతావుల్లా ఖండించారు. నాని టీడీపీని విడిచిపెట్టి బీజేపీలో చేరబోతున్నారని, అందుకే తన కార్యాలయం ‘కేశినేని భవన్’లోని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫొటోతో పాటు, పార్టీ నాయకుల ఫొటోలన్నీ తొలగించారని గత రెండురోజులుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది.