Site icon TeluguMirchi.com

కేసీఆర్‌ కార్మిక పక్షపాతి

ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని అన్నారు మంత్రి కేటీఆర్. కార్మికుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. పరిశ్రమలకు పెద్దపీట వేస్తూనే… కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నాం అన్నారు.

మే డే సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. “ఆనాడు కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఎలాంటి ఫోర్ట్‌ ఫోలియో తీసుకోలేదు. ఏశాఖ కావాలని ప్రధాని అడిగితే కేసీఆర్‌ కార్మికశాఖను ఎంచుకున్నారు. బీడీ కార్మికులకు పీఎఫ్‌ వంటి విషయాల్లో లాభం చేకూర్చేలా పనిచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలోఉద్యోగులు, కార్మికుల పాత్రని ప్రస్తావించారు. కార్మికుల మద్దతుతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు

Exit mobile version