‘ఉద్యమం’ కు క్లాప్ కొట్టిన కేసీఆర్

KCRతెలంగాణ భవన్ లో ఈరోజు “ఉద్యమం” అనే సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని తెరాస అధినేత కేసీఆర్ క్లాప్ కొట్టి చిత్రీకరణ ప్రారంభించారు. తరచుగా తెలంగాణ విషయంలో.. రాజకీయ ఉద్యమాలకు క్లాప్ కొట్టే కేసీఆర్, తాజాగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో… తెరకెక్కుతున్న “ఉద్యమం” అనే చిత్రాన్ని ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణ ఉద్యమానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు ఈ చిత్రం మంచి సందేశాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాని ఆయన తెలిపారు. కాగా, కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఎవ్వరికీ అర్థం కావని, తెలంగాణ విషయంలో ఇప్పుడు సినిమాని కూడా ఉపయోగించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.