‘‘కరోనాపై యుద్ధంలో ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేసిన వారినుంచి డైరెక్టర్ వరకు .. రాష్ట్ర ప్రజల తరఫున నేను రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. వారికి పాదాభివందనం. వారి ధైర్యం గొప్పది వాళ్లను ఎంత పొగిడినా, దండం పెట్టినా తక్కువే”అన్నారు సిఏం కేసీఆర్.
తెలంగాణలో ఇప్పటివరకు 364 కేసులు నమోదైనట్టు చెప్పిన కేసీఆర్.. ఇప్పటివరకు రాష్ట్రంలో 45 మంది డిశ్చార్జి అయ్యారనీ.. మరో 15 మంది ఎల్లుండి డిశ్చార్జి కానున్నారని తెలిపారు ‘ కరోనా మన దేశంలో పెట్టిన జబ్బు కాదు. మొదటి విడత 25937 మందిని క్వారంటైన్ చేశాం. వారిలో 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా మలుచేస్తున్నాం. కరోనా పాజిటివ్ వచ్చిన 50 మందిలో ఎవరూ చనిపోలేదు. ఇప్పటివరకు 11మంది మృతిచెందారు’’ అని వివరించారు కేసీఆర్.