కేంద్రం ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ పొడిగించింది. మే 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కొన్ని సడలింపులు జారీ చేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం ప్రకటిస్తాడో అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కేంద్రం మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగించిన సమయంలో.. తెలంగాణలో మాత్రం మే 29వ తేదీ వరకు లాక్‌డౌన్ ఉంటుందని ప్రకటించారు కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంటే.. అదనంగా రెండు రోజులు కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో.. లాక్‌డౌన్ కొనసాగింపుపై ఇవాళ కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.
దీనికోసం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే, రాష్ట్రంలో జూన్ నాల్గో తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం.