గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇవాళ రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ సూర్యాపేట వెళ్లారు. చైనా సైనికుల దాడిలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు చిత్రాపటానికి పుష్ప నివాళి అర్పించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్.. కల్నల్ కుటుంబసభ్యులతో మాట్లాడారు.
కల్నల్ సంతోష్ భార్య సంతోషితో మాట్లాడిన కేసీఆర్.. ఆమెకు గ్రూప్ వన్ జాబ్ అపాయింట్ ఆఫర్‌ను అందజేశారు. అంతేకాకుండా కుటుంబానికి అయిదు కోట్లరూపాయల చెక్‌ను కూడా అందజేశారు. షేక్‌పేటలో 700 గజాల ఇంటి స్థలాల పత్రాలను కూడా సీఎం కేసీఆర్.. కల్నల్ సంతోష్ కుటుంబానికి అందజేశారు. ఆర్థిక సాయంతో పాటు గ్రూప్ వన్ జాబ్ ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.